యూజీసీ -నెట్‌ పరీక్ష తేదీలు విడుదల

యూజీసీ -నెట్‌ 2021 పరీక్ష తేదీలు విడుదలయ్యాయి. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) నిర్వహించే ఈ పరీక్షలు మే 2 నుంచి జరగనున్నట్టు  కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ వెల్లడించారు......

Updated : 02 Feb 2021 15:18 IST

దిల్లీ: యూజీసీ -నెట్‌ 2021 పరీక్ష తేదీల షెడ్యూలు విడుదలైంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) నిర్వహించే ఈ పరీక్ష మే 2 నుంచి జరగనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఆయన ట్వీట్‌ చేశారు. దీంట్లో స్కోరు సాధిస్తే జూనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడుతుంది. ఈ పరీక్షలు మే 2,3,4,5,6,7,10,11,12,14 మరియు 17 తేదీల్లో జరుగుతాయని కేంద్రమంత్రి వెల్లడించారు. ఈ పరీక్ష రాసే అభ్యర్థులందరికీ ఆయన శుభాకాంక్షలు చెప్పారు. 

యూజీసీ నెట్‌ పరీక్ష ఆన్‌లైన్‌లో జరగనుంది. ఈ పరీక్ష కోసం ఫిబ్రవరి 2 నుంచి (నేటి నుంచి) మార్చి 2వరకు అభ్యర్థులు ugcnet.nta.nic.inలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  మార్చి 3 వరకు దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించారు.  నెట్‌ ద్వారా జేఆర్‌ఎఫ్‌కి ఎంపికైనవారు స్టైపెండ్‌తో కూడిన పీహెచ్‌డీ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. జేఆర్‌ఎఫ్‌ అర్హత సాధించినవారికి ప్రతి నెలా స్ట్టైపెండ్‌, ఏటా కాంటింజెన్సీ గ్రాంటు అందుతాయి.

ఇదీ చదవండి..

కొవిడ్‌ మహమ్మారికి..160మంది వైద్యులు బలి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని