మరో ‘తుపాను’కు సిద్ధమైన విజయ్‌ దేవరకొండ! (ప్రకటన)

విజయ్‌ కొత్తగా ఓ వ్యాపార ప్రకటనలో కనిపించబోతున్నాడు. థమ్స్‌అప్‌కు ప్రచారకర్తగా త్వరలో బుల్లితెరపై, డిజిటల్‌ ప్రచార మాధ్యమాల్లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

Updated : 02 Feb 2022 10:18 IST

అతి తక్కువ కాలంలోనే విపరీతమైన ఫాలోయింగ్‌ సంపాదించిన నటుల్లో హీరో విజయ్‌ దేవరకొండ ఒకరు. తన స్టైల్‌, విభిన్నమైన లుక్‌తో ఎప్పుడూ ట్రెండీగా కనిపించే విజయ్‌కు ఇటు తెలుగులోనే కాదు.. దేశవ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. సినిమాలతోనే కాదు నిత్యం సోషల్‌మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ హీరో త్వరలో ‘లైగర్‌’గా తెరపైకి రాబోతున్నాడు. అయితే, చాలా రోజుల నుంచి విజయ్‌ నుంచి కొత్త సినిమాలు రాకపోయినా.. యాడ్స్‌ రూపంలోనో, సోషల్‌మీడియా ద్వారానో ఫ్యాన్స్‌కు నిత్యం ఏదో ఒక కొత్త ట్రీట్‌ ఇస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మరో ‘తుపాన్‌’కు సిద్ధమయ్యాడు.

తాజాగా తన సోషల్‌మీడియా ఖాతాల్లో ‘తుపాన్‌’ (TOOFAN) అని చేర్చాడు. దీనిపై సోషల్‌మీడియాలో వెతికితే కొన్ని చిత్రాలు కనిపించాయి. అవి విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ పేజీల్లోనివి. వాటిలో విజయ్‌ దేవరకొండ ఓ చేతిలో బాటిల్‌ పట్టుకుని కనిపించాడు. దానిపై ‘సాఫ్ట్‌ డ్రింక్‌ కాదు.. ఇది తుపాన్‌’ (Soft Drink Kaadu, idi TOOFAN) అని కనిపించింది. దీంతో విజయ్‌ కొత్తగా ఓ వ్యాపార ప్రకటనలో కనిపించబోతున్నాడని అర్థమైంది. థమ్స్‌అప్‌కు ప్రచారకర్తగా త్వరలో బుల్లితెరపై, డిజిటల్‌ ప్రచార మాధ్యమాల్లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. మరి ఆ ప్రకటనలో ఎలా కనిపించనున్నాడో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. సినిమా తెరపై విజయ్‌దేవరకొండను చూసి చాలా రోజులైన అభిమానులకు.. ఓ విధంగా ఇది పండగలాంటిదే!

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు