Vizianagaram: పైకి లేచిన పట్టాలు.. తలకిందులుగా దూసుకెళ్లిన రైలు

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాద తీవ్రతకు పట్టాలు పైకి లేచాయి.

Published : 30 Oct 2023 07:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాద తీవ్రతకు పట్టాలు పైకి లేచాయి. ట్రాక్‌పై ఉన్న రైలును వెనకనుంచి మరో రైలు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖపట్నం-పలాస (08532) రైలును వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖపట్నం-రాయగడ (08504) రైలు ఢీకొట్టింది.

ప్రమాదం జరిగినప్పుడు రాయగడ రైలుకు చెందిన కొన్ని బోగీలు పక్క ట్రాక్‌పై ఉన్న గూడ్సు రైలును ఢీకొన్నాయి. రెండు ప్యాసింజర్‌, గూడ్సు రైళ్లలో కలిపి ఏడు బోగీలు నుజ్జయ్యాయి. ట్యాంకర్‌ గూడ్సుపైకి పలాస రైలుకు చెందిన రెండు బోగీలు దూసుకెళ్లడంతో పట్టాలు పైకి లేచి, దానికింద తలకిందులుగా రైలు దూసుకెళ్లిన తీరు ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. వెనుక నుంచి ఢీకొట్టిన రాయగడ రైలు ఇంజినుపైకి ఆ రైలు బోగీలే మూడు పైకెక్కి, పక్కనే ఉన్న బొగ్గు రవాణా గూడ్సు రైలును ఢీకొన్నాయి. విశాఖ-రాయగడ రైలులోని దివ్యాంగుల బోగీ పట్టాలు తప్పి పొలాల్లో పడింది. దాని వెనుక ఉన్న డీ-1 బోగి వేగానికి కొంత భాగం విరిగి పైకి లేచింది. రాత్రి సమయం కావడంతో ఘటనా స్థలంలో సహాయక చర్యలు అందించడం సవాలుగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని