పీఆర్సీని త్వరితగతిన ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది: మంత్రి బొత్స

సచివాలయంలో జాయింట్ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ సమావేశం ముగిసింది. ఉద్యోగ సంఘాలతో మరోమారు చర్చలు జరపాలని ప్రభుత్వ నిర్ణయించినట్లు భేటీ అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

Updated : 12 Feb 2024 22:33 IST

అమరావతి: సచివాలయంలో జాయింట్ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ సమావేశం ముగిసింది. ఉద్యోగ సంఘాలతో మరోమారు చర్చలు జరపాలని ప్రభుత్వ నిర్ణయించినట్లు భేటీ అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఉద్యోగ సంఘాలతో పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చలు జరిపామన్నారు. పీఆర్సీని త్వరితగతిన ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించారు. ఉద్యోగ సంఘాలు మధ్యంతర భృతి కోరాయని.. దానిపై పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పీఆర్సీ కమిషన్ వేశామని గుర్తుచేశారు.

  • ‘‘ఔయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీ నిరుత్సాహపరిచింది. మా ఉద్యమ కార్యచరణ కొనసాగుతుంది. మధ్యంతర భృతి విషయంలో ప్రభుత్వం స్పందించలేదు’’ - ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు
  • ‘‘డీఏ బకాయిలు, మధ్యంతర భృతిపై చర్చించాం. మార్చి 31 నాటికి రూ.5,600 కోట్ల బకాయిలు చెల్లిస్తామన్నారు. పీఆర్సీ బకాయిలపై గతంలో షెడ్యూలు ఇచ్చారు’’ -  సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి
  • ‘‘ఉద్యోగులకు ప్రభుత్వం ఎంత బకాయి పడిందో తెలిసింది. మార్చి నెలఖారుకు కొన్ని బకాయిలు చెల్లిస్తామన్నారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు ఇవ్వాలి. పోస్టులు మ్యాపింగ్‌ కాలేదని క్రమబద్ధీకరణ చేయట్లేదు. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి వేతనం పెంచాలని, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ చేయాలని కోరాం. తహసీల్దార్‌ రమణయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని కమిటీ తెలిపింది. ఆ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, ఉద్యోగం ఇస్తామన్నారు’’ - ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని