Mumbai: ముంబయిలో 260 మంది వైద్యులకు కరోనా

రెండో దశ కొవిడ్ ఉద్ధృతికి విలవిల్లాడిన మహారాష్ట్రలో మళ్లీ కేసులు అమాంతం విజృంభిస్తున్నాయి. ముంబయిలో బుధవారం 15 వేలకు పైగా కొత్త

Published : 06 Jan 2022 16:18 IST

ముంబయి: రెండో దశ కొవిడ్ ఉద్ధృతికి విలవిల్లాడిన మహారాష్ట్రలో మళ్లీ కేసులు అమాంతం విజృంభిస్తున్నాయి. ముంబయిలో బుధవారం 15 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు దేశంలో కరోనా బారినపడుతున్న వైద్యుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్క ముంబయిలోనే.. 3 రోజుల వ్యవధిలోనే 260 మంది రెసిడెంట్ డాక్టర్లకు వైరస్ సోకింది. నగరవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో ఉన్న పలువురు వైద్యులు వైరస్ బారిన పడినట్లు మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు గణేశ్ సోలంకి వెల్లడించారు. మరోవైపు దేశవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Read latest National - International News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని