వారు కరోనా పరీక్షలకు ఒప్పుకోవడం లేదు

హాథ్రస్‌ అత్యాచార, హత్య ఘటనలో మృతురాలి కుటుంబ సభ్యులు కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షకు అంగీకరించడం లేదని అధికారులు వెల్లడించారు.

Published : 11 Oct 2020 01:09 IST

దిల్లీ: హాథ్రస్‌ అత్యాచార, హత్య ఘటనలో మృతురాలి కుటుంబ సభ్యులు కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలకు అంగీకరించడం లేదని అధికారులు వెల్లడించారు. వారిలో దగ్గు, జ్వరంతో పాటు కొద్దిగా కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయన్న సమాచారం రావడంతో వైద్య బృందం ఈ పరీక్షలు నిర్వహించడానికి హాథ్రస్‌ చేరుకుంది. 

‘ఆ ఘటన జరిగిన దగ్గరి నుంచి రాజకీయ నాయకులు, పాత్రికేయులు, పోలీసులు మృతురాలి కుటుంబం వద్దకు వెళ్లారు. వారిలో కొందరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే బాధిత కుటుంబ సభ్యుల్లో కొందరికి జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని మాకు ఫిర్యాదు అందింది. దాంతో వారిని పరీక్షించడానికి వైద్య బృందం వెళ్లగా, వారు నిరాకరించారు’ అని ఓ అధికారి మీడియాకు తెలిపారు. 

హాథ్రస్‌ ఘటన అనంతరం బాధితురాలి మృతదేహానికి హడావుడిగా అర్ధరాత్రి సమయంలో అంత్యక్రియలు నిర్వహించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. కాగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారిలో కాంగ్రెస్‌ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని