హాథ్రస్‌ కేసు.. ఇకపై సీబీఐ విచారణ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్‌ హత్యాచార కేసును ఇక సీబీఐ దర్యాప్తు చేపట్టనుంది. ఈ మేరకు సీబీఐకి సూచనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. హాథ్రస్‌ కేసును దర్యాప్తును సీబీఐ తమ అధీనంలోకి తీసుకోవాలని కేంద్రం అందులో పేర్కొంది.

Published : 10 Oct 2020 22:34 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్‌ హత్యాచార కేసును ఇకపై సీబీఐ దర్యాప్తు చేయనుంది. ఈ మేరకు సీబీఐకి సూచనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. హాథ్రస్‌ కేసు దర్యాప్తును సీబీఐ తమ అధీనంలోకి తీసుకోవాలని కేంద్రం అందులో పేర్కొంది. ఫోరెన్సిక్‌ నిపుణుల సమక్షంలో ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి విచారించాలని అందులో తెలిపింది. ఘజియాబాద్‌ బ్రాంచ్‌కు చెందిన సీబీఐ బృందం ఈ కేసును దర్యాప్తు చేపట్టనుంది. దీనికి సంబంధించి సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సి ఉంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో ఓ దళిత యువతిపై నలుగురు అగ్రకులానికి చెందిన వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. బాధితురాలిని తీవ్రంగా హింసించడంతో ఆమె చికిత్స పొందుతూ మరణించింది. దీంతో ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం కూడా అనేక విమర్శలు ఎదుర్కొంది. తొలుత సిట్‌ దర్యాప్తునకు ఆదేశించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌.. అనంతరం సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని