‘మరో మహమ్మారి రాకుండా జాగ్రత్తపడదాం’ 

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌-19 వైరస్‌పై యుద్ధంలో కృషిచేస్తున్న కరోనా వారియర్లను టిబెటన్‌ బౌద్ధమత గురువు దలైలామా ప్రశంసించారు. భవిష్యత్తులో ఇలాంటి మరో మహమ్మారి.........

Published : 11 Oct 2020 01:05 IST

బౌద్ధమత గురువు దలైలామా

ధర్మశాల: ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌-19 వైరస్‌పై యుద్ధంలో కృషి చేస్తున్న కరోనా వారియర్లను టిబెటన్‌ బౌద్ధమత గురువు దలైలామా ప్రశంసించారు. భవిష్యత్తులో ఇలాంటి మరో మహమ్మారి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆయన ఓ సందేశం ఇచ్చారు. ఈ రోజుల్లో కరోనా వైరస్‌ను ఎదుర్కొంటున్నామనీ, ఇది చాలా బాధాకరమన్నారు. మన కర్మ కొద్దీ జరిగిందేదో జరిగిపోయిందని, దాన్ని మార్చలేమని వ్యాఖ్యానించారు. ఇలాంటి మరో మహమ్మారి రాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న సిబ్బంది నిబద్ధతను కొనియాడారు. సాధ్యమైనంత త్వరగా కరోనా మహమ్మారి అంతం కావాలని రోజూ ఉదయాన్నే తాను మంత్రాలు పఠిస్తున్నట్టు దలైలామా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని