నేటి తరం బాలలు.. తెలివిలో సంపన్నులు

కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పొఖ్రియాల్‌ నిశాంక్‌  శనివారం ట్విటర్‌ ద్వారా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరికి బాలల దినోత్సవ శుభాకాంక్షలు.

Updated : 13 May 2022 12:59 IST

న్యూ దిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పొఖ్రియాల్‌ నిశాంక్‌  శనివారం ట్విటర్‌ ద్వారా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరికి బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన రోజు.  బాలలు చదువులో రాణిస్తూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూన్నా.  నేటితరం పిల్లలు చాలా తెలివిగలవారు. వారిని చూసి గర్వపడుతున్నా’అని ఆయన ట్వీట్‌ చేశారు.  భారత మొదటి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకొంటారు. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌లో 1889, నవంబర్‌ 14న నెహ్రూ జయించారు.  బాలల హక్కులు, సంరక్షణ, విద్యా ప్రమాణాల కోసం ప్రతి ఏడాది నవంబర్‌ 14న పాఠశాలలు, విద్యా సంస్థల్లో వేడకలు నిర్వహిస్తారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని