Ramdev: నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా
అల్లోపతి వైద్యంపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
దిల్లీ: అల్లోపతి వైద్యంపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అల్లోపతి వైద్యం, వైద్యులను అవమానించేలా బాబా రామ్‌దేవ్ మాట్లాడారని భారత వైద్య సంఘం(ఐఎంఏ) తీవ్రంగా ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ తక్షణం స్పందించి ఆయనపై కేసు నమోదుచేయాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో బాబా రామ్‌దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ స్పందించారు. అల్లోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని రామ్‌దేవ్‌కు సూచిస్తూ లేఖ రాశారు. దీంతో బాబా రామ్‌దేవ్ అల్లోపతి వైద్యంపై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్రమంత్రి హర్షవర్ధన్ ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ‘‘మీ లేఖ నాకు అందింది. వైద్య విధానాలపై నేను చేసిన వ్యాఖ్యలపట్ల చింతిస్తున్నాను. నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను ’’ అని ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Nara Lokesh - Yuvagalam: మరోసారి అడ్డుకున్న పోలీసులు.. స్టూల్‌పైనే నిల్చుని నిరసన తెలిపిన లోకేశ్
-
India News
Mallikarjun Kharge: వాజ్‌పేయీ మాటలు ఇంకా రికార్డుల్లోనే..’: ప్రసంగ పదాల తొలగింపుపై ఖర్గే
-
Sports News
IND vs AUS: మళ్లీ జడేజా మాయ.. స్మిత్ దొరికేశాడు.. ఆసీస్ స్కోరు 118/5 (43)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
ECI: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
-
Movies News
Samyuktha: మా నాన్న ఇంటి పేరు మాకొద్దు.. అందుకే తీసేశాం: సంయుక్త