Black fungus: ఆ నీటి వాడకంతో వ్యాప్తి!

ఆక్సిజన్‌ అందించేప్పుడు స్టెరైల్‌ నీటికి బదులు సాధారణ నీటిని హ్యుమిడిఫయర్‌ (తేమ అందించే పరికరం) ద్వారా

Updated : 15 May 2021 09:53 IST

దిల్లీ: ఆక్సిజన్‌ అందించేప్పుడు స్టెరైల్‌ నీటికి బదులు సాధారణ నీటిని హ్యుమిడిఫయర్‌ (తేమ అందించే పరికరం) ద్వారా అందించడం కూడా బ్లాక్‌ ఫంగస్‌కు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశంపై అహ్మదాబాద్‌కు చెందిన సీనియర్‌ హృద్రోగ చికిత్స నిపుణులు డాక్టర్‌ అతుల్‌ అభ్యంకర్‌ మాట్లాడుతూ... ‘‘బ్లాక్‌ ఫంగస్‌ వ్యాప్తికి ప్రధాన కారణం... ఆక్సిజన్‌కు ఉపయోగించే హ్యుమిడిఫయర్లే. వాటిలో స్టెరైల్‌ నీటినే ఉపయోగించాలి. కానీ, ప్రైవేటు ఆసుపత్రులు, కొవిడ్‌ ఐసోలేషన్‌ కేంద్రాలు, ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్నవారు సాధారణ నల్లా నీటిని వాడేస్తున్నారు. అందులో రకరకాల సూక్ష్మజీవులు ఉంటాయి. వాటి కారణంగా శరీరంలో ఫంగస్‌ ఏర్పడుతోంది. 24 గంటల్లో రెండుసార్లు నీటని మార్చాలి. ఎప్పటికప్పుడు హ్యుమిడిఫయర్‌ను శుభ్రం చేయాలి’’ అని సూచించారు.  కొవిడ్‌ చికిత్సలో భాగంగా స్టిరాయిడ్స్‌ ఇస్తున్నారు. వాటి దుష్పభ్రావాల కారణంగా మ్యూకోర్‌మైకోసిస్‌ దాడి చేస్తోంది. కళ్లు, ముక్కు, మెదడు, పళ్లపై ప్రభావం చూపుతోంది. గుజరాత్‌లో కొందరు ఆవు పేడను, మూత్రాన్ని శరీరానికి పూసుకొంటున్నారు. ఈ విధానం కారణంగా మ్యుకర్‌మైకోసిస్, ఇతర ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లు దాడి చేస్తున్నట్టు నిపుణులు హెచ్చరించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని