బెంగాల్‌లో తుది దశ పోలింగ్ ప్రారంభం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం ఉదయం చివరి (8వ) దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో భాగంగా మొత్తం 35 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ సమయం ప్రారంభం కాగానే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలి వస్తున్నారు. 35 స్థానాల పరిధిలో 84.77 లక్షల ఓటర్లు ఉండగా.. 11,860 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఓటర్లు వైరస్ బారిన పడకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో 753 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ఈ దశలో మొత్తం 283 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది.
రాష్ట్రంలో ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తుండగా.. మరోవైపు పోలింగ్ జరుగుతోంది. బెంగాల్‌లో బుధవారం ఒక్కరోజే 17వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా, 77 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక బెంగాల్‌తో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2వ తేదీన వెలువడనున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
75th Independence Day: ఎర్రకోట వేడుకల్లో.. అత్యాధునిక తుపాకులతో ‘గన్ సెల్యూట్’
-
World News
Death Valley: డెత్ వ్యాలీలో వరద బీభత్సం.. అరుదైన వర్షపాతం నమోదు
-
Sports News
Rohit sharma: ఈ ఫ్లాన్తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
-
Viral-videos News
Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
-
Movies News
Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి
-
General News
Pancreatitis: కడుపులో నొప్పిగా ఉంటుందా..? ఇది ఎలా వస్తుందో తెలుసా..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?
- Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
- Aamir Khan: ‘గత 48గంటల నుంచి నేను నిద్రపోలేదు’ : ఆమిర్‌ఖాన్
- Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి
- IIT Madrasలో రికార్డుస్థాయి ప్లేస్మెంట్లు..ఓ విద్యార్థికి ₹2కోట్ల వార్షిక వేతనం!
- UN: ఐరాస ఉగ్ర ఆంక్షల విధానాలపై మండిపడ్డ భారత్..!
- Rohit sharma: ఈ ఫ్లాన్తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
- Death Valley: డెత్ వ్యాలీలో వరద బీభత్సం.. అరుదైన వర్షపాతం నమోదు
- నేను చెప్పేవరకూ ఎఫైర్ వార్తలను సీరియస్‌గా తీసుకోవద్దు: రష్మిక