ఇలా కూడా పేరు పెట్టుకుంటారా?

మనం పుట్టగానే తల్లిదండ్రులు సంప్రదాయం ప్రకారం నక్షత్రం.. జాతకం వంటివి చూసి పేర్లు పెడుతుంటారు. ఆ పేరే మన జీవితాంతం ఒక గుర్తింపుగా ఉంటుంది. స్కూల్‌ సర్టిఫికేట్స్‌ నుంచి ఇన్సూరెన్స్‌ సర్టిఫికేట్స్‌ వరకు అన్నింటిపై అదే పేరు కొనసాగుతుంది. అయితే, పెద్దయ్యాక కొందరు తల్లిదండ్రులు

Published : 08 Mar 2021 01:07 IST

కోల్‌కతా: బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులు సంప్రదాయం ప్రకారం నక్షత్రం.. జాతకం వంటివి చూసి పేర్లు పెడుతుంటారు. ఆ పేరే మన జీవితాంతం ఒక గుర్తింపుగా ఉంటుంది. స్కూల్‌ సర్టిఫికెట్స్‌ నుంచి ఇన్సూరెన్స్‌ పత్రాల వరకు అన్నింటిపై అదే పేరు కొనసాగుతుంది. అయితే, పెద్దయ్యాక కొందరు తల్లిదండ్రులు పెట్టిన పేరు నచ్చలేదనో, పేరులో మార్పు చేస్తే అదృష్టం కలిసొస్తుందనో పూర్తిగా పేరు మార్చుకోవడం.. స్వల్ప మార్పులు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళ కూడా తన పేరును మార్చుకోవాలని చట్టపరంగా చేయాల్సిన పనులన్నీ చేస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆమె ఎంచుకున్న పేరే ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

ఈస్ట్‌ మెడినిపుర్‌ జిల్లా బరారంకువ గ్రామంలో నివసించే అనామిక మజుందార్‌ అనే మహిళ తన పేరును ‘సుప్రీం ఇంపెరియమ్‌’గా మార్చుకుంది. అంటే సర్వాధికారం అని అర్థం. అయితే, పేరు మార్చుకోవాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ క్రమంలో దరఖాస్తు ఇవ్వడంతోపాటు.. స్థానిక పత్రికల్లో ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే తన పేరు మార్పుకు సంబంధించి ఇటీవల పత్రికలో ప్రకటన ఇచ్చింది. తన పూర్తి వివరాలు వెల్లడిస్తూ తన పేరును అనామిక మంజుదార్‌ నుంచి సుప్రీం ఇంపెరియమ్‌గా మార్చుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. సాధారణంగా అలాంటి పేరు ఎవరూ పెట్టుకోరు. అందుకే, ఆమె ప్రకటనను నెటిజన్లు విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. కొందరు ఆమె ఎందుకు అలా పేరు మార్చుకోవాలనుకుంటుందో తెలుసుకోవాలని ఉందని, ఎవరైనా చెప్పండని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని