Bihar: బిహార్‌లో రాజకీయ ఉత్కంఠ.. ఆసక్తికరంగా స్పీకర్‌ కొవిడ్ రిపోర్ట్‌..!

బిహార్‌లో భాజపా, జేడీయూ బంధానికి బీటలు వారిన నేపథ్యంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

Published : 09 Aug 2022 16:50 IST

పట్నా: బిహార్‌లో భాజపా, జేడీయూ బంధానికి బీటలు వారిన నేపథ్యంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన వార్తలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే..?

బిహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాకు సోమవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా మంగళవారం చేసిన పరీక్షలో మాత్రం నెగెటివ్‌గా తేలింది. భాజపాకు చెందిన ఈ నేత.. తనకు నెగెటివ్ వచ్చిన విషయాన్ని ఈ రోజు ట్విటర్ వేదికగా వెల్లడించారు. బిహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న సమయంలో స్పీకర్ కరోనా రిపోర్ట్‌ ఆసక్తికరంగా మారింది. సిన్హా ఇంత వేగంగా కోలుకోవడంపై నెటిజన్లు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా భాజపా నేత మంగళ్‌ పాండే చేతిలో ఉండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. 

కొద్ది నెలల క్రితం మహారాష్ట్ర కూడా అధికార సంక్షోభంలో కూరుకుపోయిన వేళ.. ఆ రాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీకి కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కీలకంగా వ్యవహరించాల్సిన గవర్నర్‌ ఆసుపత్రిలో చేరారు. అదే సమయంలో అప్పుడు మహా ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్ధవ్‌ ఠాక్రే కూడా తాను మహమ్మారి బారినపడినట్లు ప్రకటించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని