BSF: గుజరాత్‌లో పాక్‌ ఆగంతకుల కోసం బీఎస్‌ఎఫ్‌ గాలింపు!

గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతం సర్‌ క్రిక్‌ వద్ద పాకిస్థాన్‌ జాతీయలను బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది గుర్తించారు....

Published : 10 Feb 2022 20:50 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతం సర్‌ క్రిక్‌ వద్ద పాకిస్థాన్‌ జాతీయలను బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది గుర్తించారు. 11 మత్స్యకార బోట్ల ద్వారా వచ్చిన వారికోసం గాలింపు కొనసాగుతోంది. బురదయ కయ్యల్లో దాగున్న వారిని పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. 300 చదరపు కి.మీ ప్రాంతంలో హెలికాప్టర్‌ ద్వారా బీఎస్‌ఎఫ్‌ కమాండోలు గాలిస్తున్నారు. ఇందులో భాగంగా సర్‌ క్రిక్‌ ప్రాంతంలోని బురద నేలలు, తోటల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కచ్‌ ప్రాంతంలోని సర్‌క్రిక్‌ వద్ద హరామీ నాలా ద్వారా సరిహద్దు దాటేందుకు వీరు ప్రయత్నించినట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని