OPS: ఆ ఉద్యోగులకు ఓపీఎస్ అవకాశం.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

కేంద్రప్రభుత్వ ఉద్యోగుల్లోని కొంతమందికి పాత పింఛను విధానం (ఓపీఎస్‌)ను ఎంచుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది.

Updated : 04 Mar 2023 09:13 IST

దిల్లీ: కేంద్రప్రభుత్వ ఉద్యోగుల్లోని కొంతమందికి పాత పింఛను విధానం (ఓపీఎస్‌)ను ఎంచుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఇందుకోసం ఈ ఏడాది ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ సూచించింది. డిసెంబరు 22, 2003కు ముందు వెలువడిన ఉద్యోగ నియామక ప్రకటనల ఆధారంగా నియమితులైన ఉద్యోగులకు ఓపీఎస్‌ను ఎంచుకునే అవకాశం దక్కనుంది. జాతీయ పింఛను విధానం (ఎన్‌పీఎస్‌) డిసెంబరు 22, 2003న అమల్లోకి వచ్చింది. ఉద్యోగ వర్గాల నుంచి వచ్చిన పలు వినతులను పరిశీలించిన మీదట అప్పటి వారికి పాత పింఛను అవకాశాన్ని కల్పిస్తూ కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని