అలాంటి పోలీసు చిత్రాలు డేంజర్: బాంబే హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు
సింగం(Singham) వంటి పోలీసు చిత్రాలను ఉద్దేశించిన బాంబే హైకోర్టుకు చెందిన జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే..?
అ
ముంబయి: న్యాయ ప్రక్రియను పట్టించుకోకుండా సత్వరమైన న్యాయాన్ని అందించే సింగం(Singham) వంటి పోలీసు సినిమాలు ప్రమాదకరమని బాంబే హైకోర్టుకు చెందిన న్యాయమూర్తి జస్టిస్ గౌతమ్ పటేల్(Justice Gautam Patel of the Bombay High Court ) అభిప్రాయపడ్డారు. ఇలాంటి సినిమాలు హానికరమైన సందేశాన్ని పంపుతాయని అన్నారు. ఇండియన్ పోలీసు ఫౌండేషన్ వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా న్యాయ ప్రక్రియ విషయంలో ప్రజల అసహనాన్ని ప్రశ్నించారు.
‘పోలీసుల్ని రౌడీలు, జవాబు దారీ లేనివారిగా చూపించడం పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టుల గురించి ఇలాగే చిత్రీకరిస్తున్నారు. కోర్టులు తమ పని తాము చేయడం లేదని ప్రజలు భావించినప్పుడు.. పోలీసుల చర్యలను స్వాగతిస్తున్నారు. అందుకు ఉదారహరణగా.. అత్యాచార కేసుల్లోని నిందితుల్ని పోలీసులు ఎన్కౌంటర్ చేసినప్పుడు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అప్పుడు న్యాయం జరిగిందని వారు భావిస్తారు. కానీ న్యాయం జరిగిందా..?’ అని ప్రశ్నించారు.
పన్నూ వార్నింగ్ ఇస్తే.. కేంద్రం షాకిచ్చింది: ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ
‘సింగం చిత్రం క్లైమాక్స్‌లో మొత్తం పోలీసులందరూ విలన్ పాత్రగా చిత్రీకరించిన రాజకీయ నాయకుడిపై తిరగబడతారు. దాంతో అక్కడ న్యాయం జరిగినట్లు చూపించారు. కానీ అక్కడ న్యాయం జరిగిందా..? ఎందుకింత అసహనం. ఈ ప్రక్రియ నిదానంగా జరుగుతుంది. వ్యక్తి స్వేచ్ఛను హరించకూడదనే సూత్రమే అందుకు కారణం. షార్ట్‌కట్స్ వెంటపడితే ఈ న్యాయ ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే ఇలాంటి సందేశాలు ఎంత ప్రమాదకరమో ఆలోచించారా..?’ అని అన్నారు.
పోలీసు యంత్రాంగం పనితీరులో సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ వేసిన యూపీ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ప్రకాశ్ సింగ్ ప్రయత్నాన్ని జడ్జి కొనియాడారు. ఆయన సంస్కరణలు సాకారం కావడంలో అవిశ్రాంత పోరాటం చేశారని చెప్పారు. అలాగే మనల్ని మనం సంస్కరించుకుంటే తప్ప చట్టం అమలులో యంత్రాంగాన్ని సంస్కరించడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.
2011లో రోహిత్‌శెట్టి దర్శకత్వంలో సింగం సినిమా విడుదలైంది. అందులో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ ఒక పవర్ఫుల్ పోలీసు అధికారిగా కనిపిస్తారు. ఇది 2010లో వచ్చిన తమిళ చిత్రానికి రీమేక్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Bomb threat: బెంగళూరులో 44 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
బెంగళూరు (Bengaluru)లో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రెండు విడతలుగా ఈ బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. -
BSF: వీర జవాన్లతో.. పాక్, బంగ్లా సరిహద్దులు సురక్షితం: అమిత్ షా
సరిహద్దులు సురక్షితంగా లేకపోతే దేశం అభివృద్ధి చెందదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. -
ఏడాదిగా తల్లి మృతదేహంతో ఇంట్లోనే అక్కాచెల్లెళ్లు..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఏడాది క్రితం చనిపోయిన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని జీవిస్తున్న వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. -
శ్రీనగర్ నిట్‌లో సోషల్ మీడియా దుమారం
జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ ఎన్ఐటీలో మతపరమైన అంశంపై సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుకు నిరసనగా కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారు. -
పల్లెటూరి మేడం యూట్యూబ్ ఆంగ్ల పాఠాలు అదుర్స్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబీ జిల్లా సిరాథూ నగర పంచాయతీకి చెందిన యశోద అనే గ్రామీణ యువతి ఆంగ్ల బోధనకు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి విశేష ఆదరణ చూరగొంటోంది. -
Gated community: గేటెడ్ కమ్యూనిటీ రోడ్లపై ఎవరైనా వెళ్లవచ్చు!
గేటెడ్ కమ్యూనిటీల్లోని రహదారులపై బయటి వారు కూడా రాకపోకలు సాగించవచ్చని కర్ణాటక ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. -
సిల్క్యారాలోనా.. సొంత ఊళ్లకా!
మృత్యువు అంచువరకు వెళ్లి రెండ్రోజుల క్రితం క్షేమంగా తిరిగివచ్చిన సిల్క్యారా సొరంగ కార్మికులు ఇప్పుడు అక్కడే ఉండి ఎప్పటిలా పనిచేసుకోవాలా, సొంత ఊళ్లకు వెళ్లిపోవాలా అనే ఊగిసలాటలో ఉన్నారు. -
నా దృష్టిలో పెద్దకులాలు ఆ నాలుగే
‘నా దృష్టిలో నాలుగు పెద్ద కులాలవారంటే పేదలు, యువత, మహిళలు, రైతులు. వారి ఎదుగుదలతోనే దేశం అభివృద్ధి చెందుతుంది’ అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
ఒడిశా అడవుల్లో బ్లాక్ పాంథర్
ఒడిశా అడవుల్లో బ్లాక్ పాంథర్(నల్ల చిరుత) కనిపించింది. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) సుశాంత నందొ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వివరాలు వెల్లడించారు. -
కన్నూర్ వర్సిటీ వీసీగా రవీంద్రన్ పునర్నియామకం కొట్టివేత
కేరళలోని కన్నూర్ యూనివర్సిటీ ఉప కులపతి (వైస్‌ఛాన్సలర్/వీసీ)గా గోపీనాథ్ రవీంద్రన్ పునర్నియామకాన్ని సుప్రీం కోర్టు గురువారం కొట్టివేసింది. -
విమానంలో నీటి ధార
విమానంలో క్యాబిన్ పైకప్పు నుంచి ఏర్పడిన నీటి లీకేజీతో ప్రయాణికులు ఇబ్బంది పడిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది. -
శోమాకాంతి సేన్ బెయిల్ అభ్యర్థనను వ్యతిరేకించిన ఎన్ఐఏ
ఎల్గార్ పరిషద్ - మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు శోమాకాంతి సేన్ ఆరోగ్య కారణాలతో సుప్రీంకోర్టులో పెట్టుకున్న మధ్యంతర బెయిల్ అభ్యర్థన పిటిషన్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గట్టిగా గురువారం వ్యతిరేకించింది. -
నాడు భారత్‌ను ద్వేషించి.. నేడు ప్రేమించి..!
అమెరికా భద్రతా సలహదారుడిగా, విదేశాంగ మంత్రిగా హెన్రీ కిసింజర్ 70వ దశకంలో తీవ్ర భారత్ వ్యతిరేకవైఖరిని అవలంబించారు. పాకిస్థాన్‌తో మాత్రం సత్సంబంధాలు కొనసాగించారు. -
కుర్చీ పట్టుకోమ్మా.. లేదా ఆమె కూర్చుంటుంది: మోదీ
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎక్కువమందికి చేర్చడానికి ఉద్దేశించిన ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’లో భాగంగా వివిధ స్కీంల లబ్ధిదారులను ఉద్దేశించి గురువారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. -
సాధ్యమైనంత త్వరగా తదుపరి విడత సైనిక చర్చలు
తూర్పు లద్దాఖ్‌లో బలగాల ఉపసంహరణను పూర్తిచేయడంతోపాటు అపరిష్కృతంగా ఉన్న పలు అంశాలపై భారత్, చైనాలు గురువారం దౌత్యపరమైన చర్చలు జరిపాయి. -
పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ రేపు
ఈ నెల 4 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శనివారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. -
జ్ఞానవాపి సర్వే నివేదిక సమర్పణకు 10 రోజుల గడువు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాశీలో జ్ఞానవాపి మసీదు ఆవరణలో భారత పురావస్తు విభాగం (ఏఎస్ఐ) నిర్వహించిన సర్వే నివేదిక తయారీ, సమర్పణకు వారణాసి జిల్లా కోర్టు మరో 10 రోజుల గడువిచ్చింది. -
వాయు కాలుష్యంతో భారత్‌లో ఏటా 21 లక్షల మంది బలి
ఆరుబయట చోటుచేసుకుంటున్న వాయు కాలుష్యం వల్ల భారత్‌లో ఏటా 21.8 లక్షల మంది బలవుతున్నారని తాజా అధ్యయనం పేర్కొంది. -
న్యాయాధికారులకు గౌరవప్రదమైన సౌకర్యాలు
న్యాయాధికారులకు గౌరవప్రదమైన సౌకర్యాలు, పని వాతావరణం ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని సుప్రీంకోర్టు గురువారం స్పష్టంచేసింది. -
లోక్‌సభ సెక్రటరీ జనరల్ పదవీ కాలం పొడిగింపు
లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
సిల్క్యారా కార్మికులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా
సిల్క్యారా సొరంగం నుంచి బయటకు వచ్చిన 41 మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను చెక్కుల రూపంలో అందించినట్లు ఈ పనులు చేపట్టిన ‘నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్’ తెలిపింది.


తాజా వార్తలు (Latest News)
-
Bomb threat: బెంగళూరులో 44 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
-
BSF: వీర జవాన్లతో.. పాక్, బంగ్లా సరిహద్దులు సురక్షితం: అమిత్ షా
-
Ambati Rambabu: తెలంగాణలో ఏ పార్టీనీ గెలిపించాల్సిన అవసరం మాకు లేదు: అంబటి
-
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా నాలుగో టీ20.. స్టేడియంకు ‘కరెంట్’ కష్టాలు..!
-
ఆహ్వానం అందక.. అర్ధగంట విమానం డోర్ వద్దే నిల్చున్న అధ్యక్షుడు..!
-
Animal movie review: రివ్యూ: యానిమల్.. రణ్‌బీర్-సందీప్ వంగా యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?