గవర్నర్‌ దత్తాత్రేయను నెట్టేసిన ఎమ్మెల్యేలు

హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో అనుచిత ఘటన చోటుచేసుకుంది. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

Updated : 26 Feb 2021 15:38 IST

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో అనుచిత ఘటన చోటుచేసుకుంది. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తన ప్రసంగం ముగించుకుని వెళ్తుండగా పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆయన్ను నెట్టేశారు. దీనిపై అధికార భాజపా మండిపడింది. దీనికి కారణమైన నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్‌కు భాజపా తీర్మానం ప్రవేశపెట్టింది. గవర్నర్‌ను నెట్టేసిన ఘటనను హిమాచల్‌ సీఎం జైరాం ఠాకూర్‌ ఖండించారు.

బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఉదయం గవర్నర్‌ దత్తాత్రేయ అసెంబ్లీకి హాజరయ్యారు. సమావేశం ప్రారంభం నుంచే కాంగ్రెస్‌ సభ్యులు నినాదాలు చేయడం మొదలు పెట్టారు. పెరిగిన గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై మాట్లాడాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో దత్తాత్రేయ ప్రసంగం చివరి వాక్యాలను చదివి తన ప్రసంగం పూర్తైనట్లుగా భావించాలంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించి నెట్టివేశారు. గవర్నర్‌ పట్ల అనుచితంగా వ్యవహరించిన వారిని సస్పెండ్‌ చేయాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేశ్‌ భరద్వాజ్‌ తీర్మానం ప్రవేశపెట్టగా స్పీకర్‌ వారిని సస్పెండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను ఆ పార్టీ ఖండించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని