Bharat Jodo Yatra: సెప్టెంబర్‌ 7 నుంచి కాంగ్రెస్‌ ‘భారత్‌ జోడో యాత్ర’..!

ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా కన్యాకుమారీ నుంచి కశ్మీర్‌ వరకు ‘భారత్‌ జోడో యాత్ర’ నిర్వహించనుంది. సెప్టెంబర్‌ 7వ తేదీన ఇది ప్రారంభమవుతుందని పార్టీ కమ్యూనికేషన్స్‌ చీఫ్‌ జైరామ్‌

Published : 09 Aug 2022 23:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు ‘భారత్‌ జోడో యాత్ర’ నిర్వహించనుంది. సెప్టెంబర్‌ 7వ తేదీన ఇది ప్రారంభమవుతుందని పార్టీ కమ్యూనికేషన్స్‌ చీఫ్‌ జైరామ్‌ రమేష్‌ మంగళవారం ప్రకటించారు. ఈ యాత్రలో పార్టీ సభ్యులు, నాయకులతోపాటు కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా పాల్గొంటారని పేర్కొన్నారు. 

ఈ పాదయాత్ర మొత్తం 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా వెళుతుందని జైరామ్‌ రమేష్‌ తెలిపారు. 80 ఏళ్ల క్రితం మహాత్మాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ అదే రోజున భారత్‌ ఛోడో (క్విట్‌ ఇండియా) ఉద్యమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఆ యాత్ర ఫలితంగా ఐదేళ్ల తర్వాత స్వతంత్ర భారత్‌ ఏర్పడిందని గుర్తు చేశారు. 

‘సెప్టెంబర్‌ 7వ తేదీ నుంచి భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 3,500 కిలోమీటర్ల మేరకు 150 రోజులపాటు భారత్‌ జోడో యాత్ర నిర్వహిస్తారు. దీనిలో అందరు భాగస్వాములై ప్రత్యామ్నాయ రాజకీయాలకు బలం చేకూర్చాలి’ అని జైరామ్‌ రమేష్‌ కోరారు. అదే సమయంలో ట్విటర్‌లో ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ను తీవ్రంగా విమర్శించారు. గాంధీ నిర్వహించిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో ఆ సంస్థ  పాత్ర ఏమిటని ప్రశ్నించారు. ఆ  ప్రజా ఉద్యమం నుంచి పూర్తిగా దూరంగా ఉందన్నారు. గాంధీ, నెహ్రూ,పటేల్‌, అజాద్‌, ప్రసాద్‌, పంత్‌ వంటి వారు జైళ్లలో ఉంటే శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ భాగం కాలేదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని