New Year Celebrations: ఒకే ఆర్డర్‌లో 125 రుమాలీ రోటీలు.. జొమాటో సీఈవో రియాక్షన్‌ ఇదే!

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కోల్‌కతాలోని ఓ వ్యక్తి ఒకేసారి 124 రుమాలీ రోటీలను ఆర్డర్‌ చేశారు.

Updated : 02 Jan 2024 19:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. స్నేహితులంతా ఒక చోట చేరి డ్యాన్స్‌లు చేస్తూ, కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు. ఈ సందర్భంలో ఆహారానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. నచ్చిన ఫుడ్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి మరీ తింటుంటారు. అయితే, కోల్‌కతాలోని ఓ వ్యక్తి చేసిన పనికి ఫుడ్‌ యాప్‌ జొమాటో యజమానే ఆశ్చర్యపోయారు. అతడు పదో, ఇరవైయ్యో కాదు ఏకంగా 125 రుమాలీ రోటీలను జొమాటోలో ఆర్డర్‌ చేశాడు. దీంతో ఆ సంస్థ సీఈవో దీపిందర్‌ గోయల్‌ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా స్పందించారు. ఆ పార్టీకి వెళ్లాలని ఉందంటూ తన కోరికను బయటపెట్టారు. ‘‘ ఒక్క ఆర్డర్‌లోనే 125 రుమాలీ రోటీలు ఆర్డర్‌ చేశారు. ఆ పార్టీకి నిజంగా వెళ్లాలనిపిస్తోంది’’ అని గోయల్‌ పోస్టు చేశారు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని