రాజకీయాలకోసం యుద్ధభూమిగా మార్చొద్దు

ఆదివారంనాడు దేశ రాజధాని దిల్లీలోని జవహార్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)విద్యార్థులపై జరిగిన మూక దాడిని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. క్యాంపస్‌లను రాజకీయాల కోసం...

Published : 06 Jan 2020 21:19 IST

దిల్లీ: ఆదివారంనాడు దేశ రాజధాని దిల్లీలోని జవహార్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)విద్యార్థులపై జరిగిన మూక దాడిని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. క్యాంపస్‌లను రాజకీయాల కోసం యుద్ధభూమిగా మార్చొద్దని కోరారు. ‘‘నేను గతంలో చెప్పినదాన్నే పునరుద్ఘాటిస్తున్నాను, విద్యాసంస్థలను రాజకీయాల కోసం యుద్ధభూమిగా మార్చొద్దు. ఇటువంటి ఘటనలు విద్యార్థుల జీవితాలతోపాటు, వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. విద్యార్థులను రాజకీయ పనిముట్లుగా ఉపయోగించకూడదు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నందున, రాజ్యాంగ పదవిలో ఉన్న నేను దీనిపై వ్యాఖ్యానించలేను’’ అని అన్నారు.

ఈ దాడిని జేఎన్‌యూ పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్న ఎస్‌. జయశంకర్, నిర్మలా సీతారామన్‌ ఖండించారు. ‘‘దాడికి సంబంధించిన దృశ్యాలు ఎంతో భయానకంగా ఉన్నాయి. విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు సురక్షితమైన ప్రదేశాలుగా ఉండాలని ప్రభుత్వం కోరుకొంటోంది’’ అని సీతారామన్‌ అన్నారు. మరోవైపు నిన్న జరిగిన దాడికి నిరసనగా పలు నగరాలకు చెందిన వేల మంది విద్యార్థులు జేఎన్‌యూ విద్యార్థులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. దాడి ఘటనపై పూర్తి సమాచారాన్ని అందిచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా దిల్లీ పోలీసులను ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజీల ద్వారా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.    

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని