జేఎన్‌యూ దాడి: వారి ఫోన్లను సీజ్‌ చేయండి

దిల్లీ: జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ)లో దుండగుల దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను వీలైనంత త్వరగా పోలీసులకు అందజేయాల్సిందిగా దిల్లీ హైకోర్టు యూనివర్సిటీ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే జేఎన్‌యూ దాడికి సంబంధించిన

Published : 14 Jan 2020 15:19 IST

దిల్లీ: జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ)లో దుండగుల దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను వీలైనంత త్వరగా పోలీసులకు అందజేయాల్సిందిగా దిల్లీ హైకోర్టు యూనివర్సిటీ నిర్వాహకులను ఆదేశించింది. అలాగే జేఎన్‌యూ దాడికి సంబంధించిన సందేశాలు, వీడియోలను చట్టప్రకారం భద్రపరచాల్సిందిగా వాట్సాప్‌, గూగుల్‌ను ఆదేశించింది. ‘యూనిటీ ఎగనెస్ట్‌ లెఫ్ట్‌’, ‘ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌’ వాట్సాప్‌ గ్రూపుల్లో ఉన్న సభ్యులకు సమన్లు పంపించి వారి ఫోన్లను స్వాధీనపరుచుకోవాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

జేఎన్‌యూ దాడి అంశంపై వర్సిటీ ప్రొఫెసర్లు కొందరు వ్యాజ్యం దాఖలు చేయగా దీనిపై దిల్లీ హైకోర్టు విచారణ జరపింది. దాడి జరగడానికి ముందు రెండు వాట్సాప్‌ గ్రూపుల్లో దీనికి సంబంధించిన చర్చలు జరిగాయని, ఈ సంభాషణలను.. వాటిని జరిపిన వారి వివరాలను సమర్పించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు అభ్యర్థించారు. ఈ మేరకు దాడికి సంబంధించిన వివరాలు, సీసీటీవీ ఫుటేజీలు, సామాజిక వేదికల్లో నడిచిన సంభాషణలను భద్రపరిచే విషయంపై స్పందించాల్సిందిగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, యాపిల్‌ యాజమాన్యాలను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. జనవరి 5న జేఎన్‌యూలోకి చొరబడిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విద్యార్థులు, అధ్యాపకులపై కర్రలు, రాడ్లతో దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనను పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని