వారికి కొవిడ్‌-19 సోకలేదు: ఐటీబీపీ

చైనాలోని వుహాన్‌ నుంచి వెనక్కి రప్పించిన 406 మంది భారతీయుల్లో ఏ ఒక్కరికీ కొవిడ్‌-19 సోకలేదని ఇండో టిబెటన్‌ సరిహద్దు దళం(ఐటీబీపీ) అధికార ప్రతినిధి ఆదివారం వెల్లడించారు.

Published : 16 Feb 2020 18:01 IST

దిల్లీ: చైనాలోని వుహాన్‌ నుంచి వెనక్కి రప్పించిన 406 మంది భారతీయుల్లో ఏ ఒక్కరికీ కొవిడ్‌-19 సోకలేదని ఇండో టిబెటన్‌ సరిహద్దు దళం(ఐటీబీపీ) అధికార ప్రతినిధి ఆదివారం వెల్లడించారు. ఐటీబీపీ కేంద్రంలో ఉన్న వారందరికీ పరీక్షలు నిర్వహించగా కొవిడ్‌ నెగెటివ్‌గా తేలినట్లు ఆయన తెలిపారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వుహాన్‌ నుంచి వెనక్కి తీసుకువచ్చిన వారికి సంబంధించి తుది ఆరోగ్య నివేదికలు శుక్రవారం వైద్యుల చేతికి అందాయన్నారు. ఆ నివేదికల్లో మొత్తం 406 మందికి నెగెటివ్‌గానే తేలిందని వెల్లడించారు. ఆరోగ్య శాఖ సూచనల ప్రకారం.. వారందరినీ సోమవారం నుంచి దశల వారీగా విడుదల చేస్తామన్నారు. 

చైనాలో కొవిడ్-19 విజృంభించిన విషయం తెలిసిందే. దీంతో వైరస్‌ ప్రభావం అత్యధికంగా ఉన్న వుహాన్‌ నగరం నుంచి 406 మంది భారతీయుల్ని ప్రత్యేక విమానం ప్రభుత్వం వెనక్కి రప్పించింది. అప్పటి నుంచి వారు ఐటీబీపీ కేంద్రంలో ఉన్నారు. కాగా చైనాలో ఇప్పటివరకూ ఈ వైరస్‌ కారణంగా 1662 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని