అప్ప‌ట్లో రైళ్లు.. ఇప్పుడు విమానాలు..

ఎక్క‌డో చైనాలోని ప‌శ్చిమ‌ప్రాంతంలోని వుహాన్ న‌గ‌రంలో పుట్టిన క‌రోనావైర‌స్ ప్ర‌పంచంలో ఇంత వేగంగా ఎలా విస్త‌రించింది?  అన్ని దేశాల‌ను వ‌ణికిస్తున్న వైర‌స్  ప్ర‌పంచాన్ని

Published : 28 Mar 2020 01:06 IST

ఇంట‌ర్నెట్‌డెస్క్ ప్ర‌త్యేకం : ఎక్క‌డో చైనాలోని ప‌శ్చిమ‌ప్రాంతంలోని వుహాన్ న‌గ‌రంలో పుట్టిన క‌రోనావైర‌స్ ప్ర‌పంచంలో ఇంత వేగంగా ఎలా విస్త‌రించింది?  అన్ని దేశాల‌ను వ‌ణికిస్తున్న వైర‌స్  ప్ర‌పంచాన్ని స్తంభింప‌చేసింది. ఎక్క‌డి వార‌క్క‌డ నిల్చి పోయారు. పేద‌, ధనిక అంద‌రూ దీని దెబ్బ‌కు వ‌ణికిపోతున్నారు. పెద్ద పెద్ద విమానాశ్ర‌యాలు సైతం మూత‌ప‌డ్డాయి. వైర‌స్ వ్యాప్తికి ముఖ్య కార‌ణం విమానయాన‌మేన‌ని నిపుణులు తేల్చి చెబుతున్నారు.

ప్ర‌పంచీక‌ర‌ణ నేప‌థ్యంలో అనేక వ‌స్తువుల ఉత్ప‌త్తుల‌కు చైనా పైన ఆధార‌ప‌డ‌ట‌మే ఇందుకు కార‌ణ‌మైంది. చైనా వాణిజ్య‌వేత్త‌లు, నిపుణులు అనేక దేశాల్లో త‌మ వాణిజ్య కార్య‌క‌లాపాల‌ను నిర్వహిస్తున్నారు. అనేక‌మంది చైనాకు వ‌చ్చేవారు. చైనా నుంచి యూర‌ప్‌నకు, మ‌ధ్య‌ప్రాచ్యానికి క‌రోనా విస్తరించింది. ఆయా దేశాల్లో ల‌క్ష‌లాది భార‌తీయులున్నారు. వీరు అక్క‌డ వ్యాధికి గురైనా  తొలినాళ్ల‌లో ఎలాంటి ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డలేదు. ఇదే స‌మ‌యంలో వీరు భార‌త్‌కు చేరుకున్నారు. ఇక్క‌డ స్క్రీనింగ్ ప‌రీక్ష‌లు నిర్వహించినా ఎలాంటి ల‌క్ష‌ణాలు వెల్ల‌డికాలేదు. అనంత‌రం కాలంలో వీరిలో వ్యాధి ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. అప్ప‌టికే వీరు అనేక కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌య్యారు. దీంతో వ్యాధి విస్త‌ర‌ణ‌కు కార‌ణ‌మ‌య్యారు. 

అప్ప‌ట్లో రైళ్లు..

1918లో మొద‌టి ప్ర‌పంచ‌యుద్ధంలో పాల్గొన్న సైనికుల ద్వారా స్పానిష్ ఫ్లూ భార‌త్‌లోకి రావ‌డంతో ఇక్క‌డ మొద‌ల‌య్యింది. 1918 జూన్‌లో ముంబ‌యిలో బ‌య‌ట‌ప‌డిన వ్యాధి జూన్ నెలాఖ‌రుక‌ల్లా త‌మిళ‌నాడుకు విస్త‌రించింది. ముంబ‌యిలో వ్యాధి సోకిన‌వారు త‌మిళ‌నాడుకు ప్ర‌యాణించ‌డంతో అక్క‌డ కూడా మ‌హ‌మ్మారి విజృంభించింది. ఒక్క ముంబ‌యిలో వ‌చ్చిన వ్యాధి అనంత‌రం దేశం మొత్తానికి విస్త‌రించి కోట్ల మంది మ‌ర‌ణానికి కార‌ణ‌మైంది. తాజాగా క‌రోనా నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం విమాన స‌ర్వీసులు, రైళ్ల‌ను, ప్ర‌జా ర‌వాణాను నిలిపివేసింది. ఈ చ‌ర్య‌ల‌తో వైర‌స్ విస్త‌ర‌ణ‌కు క‌ట్ట‌డి వేయ‌వ‌చ్చ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఆశిస్తున్నాయి. దీనితో పాటు ప్ర‌జ‌లు సామాజికదూరం పాటిస్తే వైర‌స్ విస్త‌ర‌ణ‌ను అడ్డుకోవ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని