నక్సల్స్‌ క్యాంప్‌పై దాడి

ఉమ్మడి ఆపరేషన్‌లో భాగంగా జిల్లా రిజర్వ్‌గార్డ్, కోబ్రా దళాలు నక్సల్ క్యాంప్‌ను ధ్వంసం చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్‌లో భాగంగా మంగళవారం చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలోని నక్సల్స్‌ క్యాంప్‌పై..

Updated : 27 Feb 2024 17:15 IST

ఆయుధాలు స్వాధీనం

సుక్మా: ఉమ్మడి ఆపరేషన్‌లో భాగంగా జిల్లా రిజర్వ్‌గార్డ్, కోబ్రా దళాలు నక్సల్స్‌ క్యాంప్‌ను ధ్వంసం చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్‌లో భాగంగా మంగళవారం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలోని నక్సల్స్‌ క్యాంప్‌పై రిజర్వ్ గార్డ్, కోబ్రా దళాలు దాడి చేశాయి. పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. గత వారం నక్సలైట్లతో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో 17 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై మండిపడ్డ ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌ నక్సలైట్లను ఏరివేస్తామని పేర్కొన్న అనంతరం ఈ ఘటన జరగడం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని