కరోనా ఎఫెక్ట్‌: రోజుకు మూడు లక్షల కిట్లు

పీపీఈ(పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌) కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లు కరోనా మనదేశంలో ప్రవేశించక ముందు చాలామందికి వీటి గురించి తెలియనే

Published : 25 May 2020 22:27 IST

న్యూదిల్లీ: పీపీఈ(పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌) కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లు కరోనా మనదేశంలో ప్రవేశించక ముందు చాలామందికి వీటి గురించి తెలియనే తెలియదు. అతి తక్కువ మంది పీపీఈ కిట్లు వాడేవారు. అరుదుగా ఎన్‌-95 వినియోగించారు. కానీ, దేశవ్యాప్తంగా విజృంభించిన కరోనా వైరస్‌ నియంత్రణలో భాగస్వాములైన వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆస్పత్రి సిబ్బంది, పోలీసులకు ఇవి ఎక్కువగా అవసరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో  పీపీఈ కిట్లు, ఎన్‌95 మాస్క్‌ల తయారీ గణనీయంగా పెరిగింది. రోజుకు 3లక్షల పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లను తయారు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

పీపీఈ కిట్ల నాణ్యతపై వస్తున్న వార్తలను ఆరోగ్యమంత్రిత్వశాఖ ఖండించింది. ఆధారాలు లేని ఆరోపణలు సరికావని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశాలకు అనుగుణంగా పీపీఈ కిట్లు తయారవుతున్నాయని పేర్కొంది. ‘కొన్ని మీడియా వర్గాలు పీపీఈ కిట్ల నాణ్యతను ప్రశ్నిస్తున్నాయి. వాటికి ఆధారాలు లేవు’ అని తెలిపింది. కేంద్ర జౌళిశాఖ నియమించిన ఎనిమిది ల్యాబ్‌లు పరీక్షించిన తర్వాతే పీపీఈ కిట్లను సప్లయ్‌ చేస్తున్నామని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. అంతేకాదు, కిట్ల విషయంలో ఎలాంటి లోపం కనిపించిన ఆయా కంపెనీలపై అనర్హత వేటు వేస్తున్నట్లు వెల్లడించింది.

‘దేశీయంగా ఎన్‌-95 మాస్క్‌లు, పీపీఈ కిట్ల  తయారీ గణనీయంగా పెరిగింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం రోజుకు మూడు లక్షలు చొప్పున వీటిని ఉత్పత్తి చేస్తున్నాం’ అని ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని