చైనాపై తీవ్ర చర్యలు ఈ వారంలోనే..! ట్రంప్‌

ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌కు కారణమైన చైనాపై ఇప్పటికే అమెరికా గుర్రుగా ఉంది. ఈ విషయంలో చైనాపై చర్యలు తప్పవని పలుమార్లు స్పష్టం చేసింది. అయితే తాజాగా హాంగ్‌కాంగ్‌ విషయంలో మాత్రం చైనాపై చర్యలకు సిద్ధమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు.

Published : 28 May 2020 02:31 IST

స్పష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్‌: ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌కు కారణమైన చైనాపై ఇప్పటికే అమెరికా గుర్రుగా ఉంది. ఈ విషయంలో చైనాపై చర్యలు తప్పవని పలుమార్లు స్పష్టం చేసింది. అయితే తాజాగా హాంకాంగ్‌ విషయంలో మాత్రం చైనాపై చర్యలకు సిద్ధమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అవి ఈ వారం చివర్లోనే ఉంటాయని స్పష్టం చేశారు. వైట్‌హౌజ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్‌ పూర్తి వివరాలు వెల్లడించనప్పటికీ.. ఈ వారం చివర్లో ప్రకటించే చర్యలు చాలా శక్తిమంతంగా, ఆసక్తికరంగానూ ఉంటాయని అన్నారు.

చైనా ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ భద్రతా చట్టాన్ని హాంకాంగ్‌లో అమల్లోకి తెస్తామని చైనా ప్రకటించడంతో హాంగ్‌కాంగ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ భారీ సంఖ్యలో ప్రజలు ఆందోళన చేపట్టారు. నిరసనకారులను అదుపుచేయడానికి అక్కడి పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులను ప్రయోగించారు. ఈ సందర్భంగా వందల మందిని అరెస్టు చేశారు. హాంకాంగ్‌లో ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇవీ చదవండి..
పుట్టి ముంచిన ‘వుహాన్‌ విందు’..!
టిక్‌టాక్‌పై దెబ్బ పడిందా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని