ఉద్యోగుల కోసం ఇన్ఫోసిస్‌ ప్రత్యేక విమానం!

కొవిడ్‌-19 సంక్షోభం కారణంగా అమెరికాలో చిక్కుకుపోయిన ఇన్ఫోసిస్‌ ఉద్యోగుల్ని సంస్థ సోమవారం భారత్‌కు తీసుకొచ్చింది. దీనికోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. మొత్తం 200 మందిని స్వదేశానికి చేర్చింది.........

Published : 07 Jul 2020 15:46 IST

200 మందిని భారత్‌కు చేర్చిన సంస్థ

బెంగళూరు: కొవిడ్‌-19 సంక్షోభం కారణంగా అమెరికాలో చిక్కుకుపోయిన ఇన్ఫోసిస్‌ ఉద్యోగుల్ని సంస్థ సోమవారం భారత్‌కు తీసుకొచ్చింది. దీనికోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. మొత్తం 200 మందిని స్వదేశానికి చేర్చింది. వీరిలో కొంతమంది ఉద్యోగులు కాగా.. మరికొంత మంది వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. బెంగళూరు సహా దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న ఇన్ఫోసిస్‌ కార్యాలయాల నుంచి వీరు పనిచేసేందుకు వెసులుబాటు కల్పించింది. స్వదేశానికి చేరుకున్న వారిలో కొంతమంది వీసా గడువు కూడా ముగిసినట్లు సమాచారం.

కరోనా కట్టడి నిబంధనల్లో భాగంగా అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను భారత్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే. అన్‌లాక్ 2.0లో భాగంగా ఈ నిషేధాన్ని జులై 31 వరకు పొడిగించారు. కొన్ని కార్గో విమానాలు మాత్రమే నడుస్తున్నాయి. ఇక విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని వెనక్కి తీసుకొచ్చేందుకు ‘వందే భారత్‌’ పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల్ని నడుపుతున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని