poonawalla: పూనావాలా కోరితే భద్రత కల్పిస్తాం

కొవిడ్‌-19 మహమ్మారి నివారణకు కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రూపొందించిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) సీఈవో

Updated : 12 Jun 2021 14:55 IST

బాంబే హైకోర్టుకు తెలిపిన మహారాష్ట్ర సర్కార్‌

ముంబయి: కొవిడ్‌-19 మహమ్మారి నివారణకు కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రూపొందించిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) సీఈవో అదార్‌ పూనావాలా కోరితే తగిన భద్రత కల్పిస్తామని బాంబే హైకోర్టుకు మహారాష్ట్ర సర్కారు శుక్రవారం తెలిపింది. ప్రభుత్వ స్పందన విన్నాక.. పుణెకు చెందిన ఈ పారిశ్రామికవేత్తకు మరింత భద్రత కల్పించాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టు మూసివేసింది. పూనావాలాకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ‘వై’ కేటగిరీ సీఆర్‌పీఎఫ్‌ భద్రత కల్పిస్తోంది. వ్యాక్సిన్‌ సరఫరాకు సంబంధించి బెదిరింపులు ఎదుర్కొంటున్న పూనావాలాకు ఈ భద్రత చాలదని, ‘జడ్‌ ప్లస్‌’ భద్రత కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది దత్తా మానె ఈ పిల్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ ఎస్‌.ఎస్‌.షిండే, జస్టిస్‌ ఎన్‌.జె.జమాదార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దీపక్‌ ఠాక్రే సమాధానం ఇచ్చారు. ‘ఇవి వ్యక్తిగత వ్యవహారాలు. మీరు ఎవరి కోసం ఈ పిటిషన్‌ వేశారో ఆ పారిశ్రామికవేత్తకు అసలు పిటిషన్‌ విషయమే  తెలియకపోవచ్చు. ఒకవేళ రేపు అతను నాకు ఎలాంటి భయం లేదు, ఏ భద్రతా అక్కరలేదంటే ఎలా? కోర్టు వ్యక్తుల వెనుక పరుగులు తీసి, ఉత్తర్వులు జారీ చేయదు’ అని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని