రూ.299కే కొవిడ్‌ నిర్థారణ పరీక్ష

కొవిడ్‌-19ను నిర్ధారించే ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షను భారత్‌లో రూ.299కే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఫ్రాన్స్‌ సంస్థ పాథ్‌ స్టోర్‌ తెలిపింది.

Updated : 07 Jul 2021 09:21 IST

దిల్లీ: కొవిడ్‌-19ను నిర్ధారించే ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షను భారత్‌లో రూ.299కే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఫ్రాన్స్‌ సంస్థ పాథ్‌ స్టోర్‌ తెలిపింది. పర్యాటకం, పరిశ్రమలు, రిటైల్‌ రంగాలకు అందుబాటు ధరలో ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష లబ్ధి చేకూరుస్తుందని వెల్లడించింది. ‘కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్ష చేయించుకోవడానికి ఆర్‌టీ-పీసీఆర్‌ ధరలు అడ్డంకిగా మారాయి. అంతర్జాతీయ స్థాయి పరీక్షలను అందుబాటు ధరకే అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జెనె స్టోర్‌ గ్లోబల్‌ సీఈఓ అనుభవ్‌ సిన్హా తెలిపారు. భారత ప్రజల్లో 80 శాతం మందికి ఇది సరసమైన ధర అని పేర్కొన్నారు. పాథ్‌ స్టోర్‌కు జెనె స్టోర్‌ ఫ్రాన్స్‌ మాతృసంస్థ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని