Viral video: మెడలో సంచితో శునకం షాపింగ్‌ 

తమిళనాడులో ఓ శునకం ఎంచక్కా షాపింగ్‌ చేస్తోంది.

Updated : 07 Aug 2021 09:28 IST

తమిళనాడులో ఓ శునకం ఎంచక్కా షాపింగ్‌ చేస్తోంది. తన యజమానికి కావాల్సిన వస్తువులను ఒక్కటి కూడా పోగొట్టకుండా ఇంటికి తీసుకువస్తోంది. మిగిలిన చిల్లరను జాగ్రత్తగా తెచ్చి అప్పజెప్తోంది. తమిళనాడులోని దిండిగుల్‌ జిల్లా పళనిలోని దాస్‌ ఫెర్నాండెజ్‌ పెంపుడు కుక్క పేరు జాక్‌ స్పారో. నాలుగేళ్ల వయసు ఉండే ఈ లాబ్రడార్‌ జాతి కుక్కకు.. చిన్నప్పటి నుంచే దుకాణానికి వెళ్లి వస్తువులు తీసుకురావడాన్ని యజమాని అలవాటు చేశారు. దాస్‌ ఇచ్చిన చీటీతో దుకాణానికి వెళ్లి, అక్కడి వారు ఇచ్చే వస్తువులను ఇంటికి తీసుకొస్తుంది. జాక్‌ స్పారో షాపింగ్‌ను స్థానికులంతా ఆసక్తిగా చూస్తుంటారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని