Covid Vaccine: మరణించిన వ్యక్తికి రెండో డోసు టీకా

ఏడు నెలల క్రితం మరణించిన వ్యక్తికి వైద్య సిబ్బంది కొవిడ్‌-19 టీకా రెండో డోసు వేశారు.

Published : 12 Dec 2021 11:47 IST

 మధ్యప్రదేశ్‌లో ఘటన

ఏడు నెలల క్రితం మరణించిన వ్యక్తికి వైద్య సిబ్బంది కొవిడ్‌-19 టీకా రెండో డోసు వేశారు. టీకా ధ్రువీకరణపత్రం డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సందేశం కూడా వచ్చింది. మధ్యప్రదేశ్‌లో రాజ్‌గఢ్‌ జిల్లా బియోరాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రాంతానికి చెందిన పురుషోత్తం శక్యవార్‌(78) అనే వృద్ధుడు ఈ ఏడాది మే నెలలో మరణించారు. ఆయన పేరుతో ఉన్న మొబైల్‌కు కొవిన్‌ నుంచి డిసెంబర్‌ 3వ తేదీన టీకా రెండో డోసు తీసుకున్నట్లు, టీకా ధ్రువీకరణపత్రం డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సందేశం వచ్చింది. ఈ విషయమై వృద్ధుడి కుమారుడు ఫూల్‌ సింగ్‌ శక్యవార్‌ మాట్లాడుతూ.. ‘‘డిసెంబర్‌ 3వ తేదీన మొబైల్‌కు సందేశం వచ్చింది. టీకా ధ్రువీకరణపత్రంను సైతం డౌన్‌లోడ్‌ చేశాం. మా నాన్న గత ఏప్రిల్‌ 8న టీకా తొలి డోసు తీసుకున్నారు. ఇండోర్‌లో చికిత్స పొందుతూ మే 24న మరణించారు’’ అని తెలిపారు. కంప్యూటర్‌లో తలెత్తిన లోపం కారణంగా అలాంటి సందేశం వెళ్లి ఉండొచ్చని జిల్లా టీకా పంపిణీ అధికారి డాక్టర్‌ పీఎల్‌ భగోరియా పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని