షాంఘై సదస్సు కోసం.. పాక్‌కు భారత్‌ ఆహ్వానం

ఉగ్రవాదం, కశ్మీర్‌ అంశాలపై భారత్‌, పాకిస్థాన్‌ మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ.. కీలక పరిణామం చోటుచేసుకుంది.

Published : 26 Jan 2023 05:28 IST

దిల్లీ: ఉగ్రవాదం, కశ్మీర్‌ అంశాలపై భారత్‌, పాకిస్థాన్‌ మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ.. కీలక పరిణామం చోటుచేసుకుంది. గోవా వేదికగా త్వరలో జరగబోయే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో పాల్గొనేందుకు దాయాది దేశాన్ని భారత్‌ ఆహ్వానించింది. పాక్‌లోని భారత హైకమిషన్‌ ద్వారా విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి బుట్టో జర్దారీకి ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబరులో షాంఘై సదస్సు అధ్యక్ష బాధ్యతలు అందుకున్న భారత్‌.. ఈ ఏడాది వేసవిలో మంత్రుల స్థాయి సమావేశాలు నిర్వహించనుంది. మే 4-5 తేదీల్లో గోవా వేదికగా విదేశాంగ మంత్రుల సమావేశం జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇటీవల ఎస్‌సీఓ సభ్య దేశాలకు భారత్‌ ఆహ్వానాలు పంపింది. పాక్‌ స్పందిస్తూ.. ఆహ్వానం అందింది కానీ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. ఒకవేళ ఈ ఆహ్వానాన్ని దాయాది అంగీకరిస్తే.. పాక్‌ విదేశాంగ మంత్రి భారత్‌కు రావడం 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని