నేడు అఖిలపక్ష భేటీ

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్రం సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

Published : 30 Jan 2023 04:12 IST

రేపు ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు

దిల్లీ: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్రం సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీని పార్లమెంటు అనుబంధ భవనంలో నిర్వహించనున్నట్లు పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. ఉభయ సభల సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని ఈ భేటీలో కేంద్రం అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేయనుంది. 

* పార్లమెంటులో అనుసరించాల్సిన సహకార వ్యూహాలపై చర్చించేందుకు సోమవారం ఎన్‌డీయే పక్షాలు  సమావేశమవుతున్నాయి.

* పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసే ప్రసంగంతో బడ్జెట్‌ సెషన్‌ మంగళవారం ఆరంభమవుతుంది. ఆమె ప్రసంగానంతరం ఆర్థిక సర్వేను ప్రవేశ పెడతారు.

*  ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 2024లో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్‌డీయే-2 ప్రభుత్వం సమర్పించే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇదే కానుంది.

* బడ్జెట్‌ సమావేశాలు రెండు విడతల్లో జరుగుతాయి.  మొదటి విడత ఈ నెల 31న ప్రారôభమై ఫిబ్రవరి 13 వరకూ సాగుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని