పవిత్ర స్థలాల సందర్శనలో రాహుల్‌, ప్రియాంక

కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలు మంగళవారం శ్రీనగర్‌లోని మాతా ఖీర్‌ భవానీ మందిరం, హజ్రత్‌బల్‌ దర్గాలను సందర్శించారు.

Published : 01 Feb 2023 03:52 IST

శ్రీనగర్‌: కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలు మంగళవారం శ్రీనగర్‌లోని మాతా ఖీర్‌ భవానీ మందిరం, హజ్రత్‌బల్‌ దర్గాలను సందర్శించారు. ముందుగా గాందర్బల్‌ జిల్లాలో ఉన్న భవానీ మందిరానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. అనంతరం దాల్‌ సరస్సు ఒడ్డున ఉన్న హజ్రత్‌బల్‌ దర్గాను సందర్శించారు. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా ఈ పర్యటనను అధికారులు గోప్యంగా ఉంచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని