పీఎం-కిసాన్‌లో నగదు పెంపు ప్రతిపాదన లేదు: కేంద్రం

రైతులను ఆదుకొనేందుకు తీసుకొచ్చిన ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) పథకంలో నగదు పెంపు ప్రతిపాదన ఏదీ ప్రస్తుతానికి లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు.

Updated : 08 Feb 2023 05:41 IST

దిల్లీ: రైతులను ఆదుకొనేందుకు తీసుకొచ్చిన ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) పథకంలో నగదు పెంపు ప్రతిపాదన ఏదీ ప్రస్తుతానికి లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు కేంద్రం ఏడాదికి మూడు విడతల్లో రూ.6 వేల మొత్తాన్ని ఇస్తున్న విషయం తెలిసిందే. 2018 డిసెంబరు నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకంలో.. ఈ ఏడాది జనవరి వరకు రూ.2.24 లక్షల కోట్లను కేంద్రం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకంలో రైతులకు ఇచ్చే మొత్తాన్ని పెంచే ప్రతిపాదన ఉందా? అని లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు.. ప్రస్తుతానికి లేదంటూ.. నరేంద్రసింగ్‌ తోమర్‌ మంగళవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వమే 100 శాతం నిధులు సమకూరుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని