రైల్వే స్టేషన్‌ టీవీల్లో అశ్లీల వీడియో

బిహార్‌లోని పట్నా రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అక్కడ ఉన్న టీవీల్లో అశ్లీల దృశ్యాలు ప్రసారం కావడమే కారణం.

Published : 21 Mar 2023 04:36 IST

పట్నాలో ఘటన

పట్నా: బిహార్‌లోని పట్నా రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అక్కడ ఉన్న టీవీల్లో అశ్లీల దృశ్యాలు ప్రసారం కావడమే కారణం. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. టీవీల్లో ప్రకటనలకు బదులు ఆ అసభ్యకర దృశ్యాలు 3 నిమిషాలపాటు ప్రసారం అయ్యాయి. దీంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.   అక్కడ ప్రకటనలు ప్రసారం చేసే కాంట్రాక్టు సంస్థ దత్తా కమ్యూనికేషన్స్‌కు పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఆ దృశ్యాలు ఆగిపోయాయి. రైల్వే పోలీసులు ఆ సంస్థపై కేసు నమోదు చేశారు. అధికారులు కాంట్రాక్టును రద్దు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు