పాక్‌ చెర నుంచి విడుదల కానున్న 200 మంది భారత మత్స్యకారులు

పాకిస్థాన్‌ జైళ్లలో మగ్గుతున్న 200 మంది భారత మత్స్యకారులకు విముక్తి లభించనుంది.

Published : 03 Jun 2023 05:26 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ జైళ్లలో మగ్గుతున్న 200 మంది భారత మత్స్యకారులకు విముక్తి లభించనుంది. వివిధ సందర్భాల్లో పట్టుబడిన ఈ 200 మందితోపాటు ముగ్గురు పౌర ఖైదీలను మానవతా దృక్పథంతో విడుదల చేయనున్నట్లు పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ శుక్రవారం వెల్లడించారు. వీరిని వాఘా సరిహద్దులో భారత్‌కు అప్పగించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని