పెళ్లికి ముందు యువతి కిడ్నాప్‌.. ఎడారిలో నిందితుడి ‘సప్తపది’

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఓ యువతిని పది మంది దుండగులు అపహరించగా.. నిందితుల్లో ఒకడైన పుష్పేంద్ర ఆమెను బలవంతంగా వివాహం చేసుకునేందుకు ప్రయత్నించాడు.

Updated : 07 Jun 2023 08:48 IST

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఓ యువతిని పది మంది దుండగులు అపహరించగా.. నిందితుల్లో ఒకడైన పుష్పేంద్ర ఆమెను బలవంతంగా వివాహం చేసుకునేందుకు ప్రయత్నించాడు. జైసల్మేర్‌కు చెందిన యువతికి ఓ యువకుడితో జూన్‌ 12 వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పుష్పేంద్ర, అతని అనుచరులు ఆమెను కిడ్నాప్‌ చేశారు. ఎడారిలోకి తీసుకువెళ్లి.. బాధితురాలు ఏడుస్తున్నా పట్టించుకోని పుష్పేంద్ర.. ఆమెను చేతులతో ఎత్తుకొని గడ్డితో వేసిన మంట చుట్టూ ఏడుసార్లు తిరిగాడు. మళ్లీ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దని పుష్పేంద్ర ఆమెను బెదిరించి విడిచిపెట్టాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని