రైలు ప్రమాద మృతులను ఉంచిన పాఠశాల కూల్చివేత

ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా బహానగా పాఠశాలను కూల్చివేసి అక్కడ నూతన భవనం నిర్మించాలని ఆ రాష్ట్ర సీఎం నిర్ణయించారు.

Published : 10 Jun 2023 06:41 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా బహానగా పాఠశాలను కూల్చివేసి అక్కడ నూతన భవనం నిర్మించాలని ఆ రాష్ట్ర సీఎం నిర్ణయించారు. ఈ మేరకు బడి గదుల కూల్చివేత పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 2న బహానగా వద్ద రైళ్లు ఢీకొనగా.. ఆ ప్రమాద మృతులను తొలుత పాఠశాల గదుల్లో భద్రపరిచారు. అనంతరం జిల్లా యంత్రాంగం గదులను శుభ్రం చేసి, శానిటైజ్‌ చేయించింది. అయినప్పటికీ విద్యార్థులు అందులోకి వచ్చేందుకు భయపడుతున్నారు. తల్లిదండ్రులూ సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ విషయాన్ని కలెక్టర్‌.. సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ జిల్లా అధికార యంత్రాంగంతో చర్చించి పాఠశాల కూల్చివేతకు ఆదేశాలిచ్చారు. అక్కడ కొత్త భవనం నిర్మించాలని, అందుకు వివరణాత్మక నివేదిక 15 రోజుల్లోగా సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని