VK singh: రవాణా రంగంలో పెను మార్పులు తెస్తున్నాం: కేంద్రమంత్రి

రవాణా రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొస్తోందని.. వాటి ఫలితాలు త్వరలోనే.....

Published : 08 May 2022 02:11 IST

మేరఠ్‌: రవాణా రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొస్తోందని.. వాటి ఫలితాలు త్వరలోనే క్షేత్రస్థాయిలో కనబడతాయని కేంద్ర రవాణాశాఖ సహాయ మంత్రి వీకే సింగ్ అన్నారు. శనివారం ఆయన యూపీలోని మేరఠ్‌లో భారతీయ పరివర్తన్‌ మజ్దూర్‌ మహాసంఘ్‌ గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ వాహనాలు, కొత్త సాంకేతికతను ప్రోత్సహిస్తోందని చెప్పారు. దేశ ఆర్థిక పరిస్థితి నిరంతరం పటిష్ఠమవుతోందన్న ఆయన.. రాబోయే కాలంలో మారుతున్న దేశ చిత్రపటం ప్రజల ముందు ఉంటుందని వ్యాఖ్యానించారు. భారతదేశ పునాదుల్ని బలోపేతం చేసేందుకు రైతులు, కార్మికుల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. కార్మికుల కోసం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రస్తావించిన వీకే సింగ్‌.. నిర్మాణ పనులు శరవేగంగా, నిరంతరాయంగా కొనసాగేలా కార్మికుల ప్రయోజనాల్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. వారి ప్రయోజనాలపై ప్రభుత్వం శ్రద్ధతో వ్యవహరిస్తోందని చెప్పారు. భాజపా సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల అభ్యున్నతి కోసం సాధ్యమైన ప్రతిదీ చేస్తాయని ఈ సందర్భంగా కార్మిక సంఘం ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని