vaccine: టీకాకు ఎవరు దూరంగా ఉండాలంటే..

భారత్‌లో కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. ఆక్సిజన్‌, టీకాల కొరతతో దేశం అల్లాడిపోతోంది. ఈ నేపథ్యంలో అసలు కొవిడ్‌ టీకాకు ఎవరెవరు దూరంగా ఉండాలన్న అంశంపై కేంద్రం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది.

Published : 20 May 2021 15:29 IST

కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

దిల్లీ: భారత్‌లో కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. ఆక్సిజన్‌, టీకాల కొరతతో దేశం అల్లాడిపోతోంది. ఈ నేపథ్యంలో అసలు కొవిడ్‌ టీకాకు ఎవరెవరు దూరంగా ఉండాలన్న అంశంపై కేంద్రం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. వీటిని నేషనల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూప్‌ ఆన్‌ వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్‌ బృందం రూపొందించింది. అవేంటంటే..

* కరోనా పాజిటివ్‌ వచ్చినవారు

కరోనా వచ్చి కోలుకున్నవారు మూడు నెలల తర్వాత టీకా తీసుకోవాలని నిపుణులు ముందు నుంచీ సూచిస్తున్నారు. ఎందుకంటే వారిలో అప్పటికే యాంటీబాడీలు తయారయ్యి ఉంటాయి. కాబట్టి వారు కొన్ని నెలల తర్వాత టీకా తీసుకుంటే మంచిది.

* ప్లాస్మా థెరపీ చేయించుకున్నవారు

కొవిడ్‌ నుంచి కోలుకున్న వ్యక్తుల ప్లాస్మాను కరోనా బాధితుల్లో ప్రవేశపెడతారు. అందులో ఉండే యాంటీబాడీల వల్ల వీరికి కరోనా నుంచి రక్షణ లభిస్తుంది. వీరు తీసుకున్న ప్లాస్మాలో ఉండే ప్రొటీన్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. వీరు కూడా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన మూడు నెలల తర్వాత టీకా తీసుకోవాలని కేంద్రం సూచిస్తోంది.

* మొదటి డోసు తీసుకున్న తర్వాత పాజిటివ్‌ వచ్చిన వారు

కొవిడ్‌ టీకా మొదటి డోసు తీసుకున్న తర్వాత పాజిటివ్‌ వచ్చినవారు కూడా కనీసం మూడు నెలల తర్వాత మరొక డోసును తీసుకోవాలని కేంద్రం సూచించింది.

* తీవ్రమైన అనారోగ్యం ఉన్నవారు

కొవిడ్‌ కాకుండా తీవ్రమైన అనారోగ్యాలు ఉన్న వారందరూ టీకా తీసుకొనేందుకు నాలుగైదు వారాలు వేచి ఉండాలని కేంద్రం సూచించింది. టీకా తీసుకున్న తర్వాత ఆయా అనారోగ్య కారణాల వల్ల ఆస్పత్రుల్లో చేరినవారు రెండు నెలల వరకు టీకా తీసుకోవడం వాయిదా వేయాలని సూచించారు.

* గర్భిణులు..

గర్భిణులకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వాలా వద్ద అంశంపై చర్చలు జరుగుతున్నాయని కేంద్రం తెలిపింది. దీనిపై నిర్ణయం తీసుకొనేవరకు గర్భిణులు టీకా తీసుకోకూడదని కేంద్రం సూచించింది.

టీకా తీసుకొనే ముందు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టు చేయించుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. టీకా తీసుకున్న 14 రోజుల తర్వాత, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చిన తర్వాత 14 రోజులకు ఎవరైనా రక్తదానం చేయొచ్చని కేంద్రం నూతన మార్గదర్శకాల్లో సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని