‘హిట్లర్‌లా మోదీ ప్రవర్తన.. అలాగైతే ఆయనలానే...’: కాంగ్రెస్‌ నేత వ్యాఖ్యలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవర్తన అడాల్ఫ్‌ హిట్లర్‌ను పోలి ఉందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి సుభోద్ కాంత్‌

Updated : 20 Jun 2022 19:23 IST

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi)పై కాంగ్రెస్‌ (Congress) పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి సుభోద్ కాంత్‌ సహాయ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రవర్తన అడాల్ఫ్‌ హిట్లర్‌ను పోలి ఉందని వ్యాఖ్యానించారు. అగ్నిపథ్‌(Agnipath) పథకాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతున్న యువతకు సంఘీభావం తెలుపుతూ దిల్లీలో కాంగ్రెస్‌ చేపట్టిన ‘సత్యాగ్రహం’(Satyagraha) దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాజపా(BJP) పాలనను ‘దోపిడీదారుల పాలన’గా అభివర్ణించారు. 

‘‘మోదీ.. హిట్లర్‌ని కూడా మించిపోయాడని భావిస్తున్నా. అప్పట్లో ఇలాగే ఆర్మీలో ‘ఖాకీ’ అనే సంస్థను హిట్లర్ సృష్టించాడు. ఒకవేళ హిట్లర్‌ బాటలోనే మోదీ నడిస్తే.. ఆయనలాగే మరణిస్తారు. ఈ విషయాన్ని మోదీ గుర్తుంచుకోవాలి’’ అని సుభోద్‌ వ్యాఖ్యానించారు. 

అయితే, సుభోద్‌ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో అంతర్గత దుమారానికి దారి తీశాయి. దీనిపై స్పందిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణి, ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుందని అన్నారు. అయితే, మహాత్మా గాంధీ సిద్ధాంతాల ప్రకారమే శాంతియుతంగా పోరాటం చేస్తామని.. దీనిలో ప్రధానిని ఉద్దేశిస్తూ చేసే అనుచిత వ్యాఖ్యలను సమర్థించబోమని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని