Corona: 90వేల దిగువకు.. ఈ నెలలో రెండోసారి
ప్రభుత్వాలు విధించి ఆంక్షల ఫలితంగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోంది.
10లక్షలకు పడిపోయిన క్రియాశీల కేసులు
దిల్లీ: ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్లు, ఆంక్షల ఫలితంగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోంది. శుక్రవారం 19,20,477 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 84,332 కొత్త కేసులు వెలుగుచూశాయి. వరుసగా ఐదోరోజూ లక్ష దిగువనే కేసులు నమోదయ్యాయి. 90 వేల దిగువకు కేసులు నమోదు కావడం ఈ నెలలో ఇది రెండోసారి. తాజాగా దేశంలో వైరస్ ఉద్ధృతి ఏప్రిల్ ప్రారంభం నాటి స్థాయికి తగ్గింది. అయితే గత మూడు రోజులుగా మరణాల్లో మాత్రం పెరుగుదల కనిపిస్తోంది. పలు రాష్ట్రాలు మరణాల లెక్కను సవరిస్తుండటంతో ఈ సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. 24 గంటల వ్యవధిలో మరో 4,002 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 2,93,59,155కి చేరగా.. 3,67,081 మంది బలయ్యారు.
ఇక నిన్న ఒక్కరోజే 1,21,311 మంది కరోనా నుంచి కోలుకున్నారు. సుమారు నెల రోజులుగా కొత్త కేసులు కంటే రికవరీలే అధికంగా ఉంటున్నాయి. అలాగే 2.79 కోట్ల మందికిపైగా వైరస్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం రికవరీ రేటు 95.07 శాతానికి చేరగా.. క్రియాశీల రేటు 3.68 శాతానికి తగ్గింది. క్రియాశీల కేసులు 10లక్షలకు పడిపోయాయి. మరోపక్క నిన్న 34.3లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 25కోట్ల మార్కుకు చేరువైంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (01/02/2023)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Morbi tragedy: మోర్బీ తీగల వంతెన విషాదం.. కోర్టు ముందు లొగిపోయిన ఒరెవా ఎండీ
-
Politics News
Mamata banerjee: ఆ పేరుతో ప్రజల్ని కేంద్రం కన్ఫ్యూజ్ చేస్తోంది: మమత
-
World News
Ukraine Crisis: ఉక్రెయిన్‌కు అమెరికా యుద్ధ విమానాలు.. తోసిపుచ్చిన బైడెన్!