India Corona: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయా..?

దేశంలో తాజాగా కరోనా కేసులు భారీగా పెరిగాయి. ముందురోజు 2,745గా ఉన్న కేసులు వెయ్యి మేర అధికంగా నమోదై, మూడు వేలు దాటాయి.

Published : 02 Jun 2022 10:00 IST

ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాలు ఏం చెప్తున్నాయి..?

దిల్లీ: దేశంలో తాజాగా కరోనా కేసులు భారీగా పెరిగాయి. ముందురోజు 2,745గా ఉన్న కేసులు వెయ్యి మేరకు పెరిగి మూడు వేలు దాటాయి. ముంబయిలో పాజిటివిటీ రేటు 8.4 శాతం చేరుకుందన్న వార్తల నేపథ్యంలో ఈ అంకెలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న ఆర్థిక రాజధాని నగరంలో 739 మందికి పాజిటివ్‌గా తేలింది. అక్కడ ఫిబ్రవరి ఒకటి తర్వాత ఇవే అత్యధిక కేసులు కావడం గమనార్హం. ఈ కొత్త కేసుల ప్రభావం బాధితుల సంఖ్యపై పడింది. దాంతో గురువారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. క్రియాశీల కేసులు 19వేల మార్కు దాటేశాయి. 

బుధవారం 4.41 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,712 మందికి పాజిటివ్‌గా తేలింది. మహారాష్ట్ర, కేరళ నుంచే రెండువేలకు పైగా కేసులొచ్చాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.60 శాతానికి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,584 మంది కోలుకున్నారు. ఐదు మరణాలు సంభవించాయి. క్రియాశీల కేసులు 19,509కి పెరిగాయి. 2020 ప్రారంభం నుంచి 4.31 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా.. 4.26 కోట్ల మందికిపైగా వైరస్‌ను జయించారు. దాంతో రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. క్రియాశీల కేసులు వాటా 0.05 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇక నిన్న 12.4 లక్షల మంది టీకా తీసుకోగా.. మొత్తంగా 193.7 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని