Nitin Gadkari: రోడ్డు ప్రమాదాల మృతుల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానం: నితిన్ గడ్కరీ

రోడ్డు ప్రమాదాల మృతుల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉన్నట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తంచేశారు.

Published : 07 Apr 2022 01:41 IST

దిల్లీ: రోడ్డు ప్రమాదాల మృతుల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉన్నట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తంచేశారు. జెనీవాలోని అంతర్జాతీయ రోడ్డు సమాఖ్య విడుదల చేసిన గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాదాలు, గాయపడుతున్నవారి సంఖ్యలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు రాజ్యసభలో తెలిపారు. 2020లో జరిగిన ప్రమాదాల్లో చనిపోయినవారిలో 18 నుంచి 45 ఏళ్లలోపువారే 70శాతం ఉన్నట్లు గడ్కరీ చెప్పారు. ఐదు ఎక్స్‌ప్రెస్‌వేలు సహా 22 గ్రీన్ ఫీల్డ్ రహదారుల నిర్మాణం జరుగుతున్నట్లు ప్రకటించారు. వాహనాల రిజిస్ట్రేషన్‌, ఛాసిస్‌ నెంబర్‌ ఆధారంగా వాహనాలకు ఫాస్టాగ్‌ జారీ చేసినట్టు వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులు 4.95 కోట్లకు పైగా ఫాస్టాగ్‌లను జారీ చేశాయని తెలిపారు. టోల్‌ ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ల ప్రవేశం 96.5 శతానికి చేరినట్టు వివరించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని