Published : 16 Nov 2021 01:31 IST

Kangana: ‘వాస్తవానికి ఎగతాళి చేయాలి’.. కంగనా వ్యాఖ్యలపై బిహార్‌ సీఎం మండిపాటు!

దిల్లీ: భారత్‌కు నిజమైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందని, 1947లో వచ్చింది భిక్ష మాత్రమేనంటూ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోన్న విషయం తెలిసిందే. స్వాతంత్ర్య సమరయోధులను అవమానించిన కంగనాను అరెస్టు చేయాలని, ఇటీవల ప్రదానం చేసిన ‘పద్మశ్రీ’ అవార్డునూ వెనక్కు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజాగా బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఈ వ్యవహారంపై స్పందించేందుకు నిరాకరిస్తూనే.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ప్రకటనలను ఎగతాళి చేయడంతోపాటు విస్మరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

‘కేవలం ప్రచారం కోసమే’

‘అసలు ఈ వ్యాఖ్యల అర్థం ఏంటి? మనం వాటిని పట్టించుకోవాలా? మనకు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందనే విషయం ఎవరికి తెలియదు! ఈ తరహా ప్రకటనలకు ఎటువంటి ప్రాధాన్యం ఉండదు. వాస్తవానికి ఇటువంటి వాటిని ఎగతాళి చేయాలి. కేవలం ప్రచారం కోసం ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలివి. నేను అలాంటి వ్యక్తులను పట్టించుకోను. ఇటువంటి విషయాలూ నా వద్ద రిజిస్టర్‌ కావు’ అని నితీశ్‌ అన్నారు. ఒకవైపు పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నా.. మరోవైపు కంగనా మాత్రం ఇటీవల తన వ్యాఖ్యలను మరోసారి సమర్థించుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, తన మాటలు తప్పని నిరూపిస్తే ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తానంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో రాసుకొచ్చారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని