Mamata Banerjee: కుక్కపిల్లతో మమత ట్రెడ్‌మిల్ వాక్‌.. వీడియో వైరల్‌!

పశ్చిమ బెంగాల్‌ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Benarjee) సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

Updated : 07 May 2023 22:22 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)కి ఫైర్‌బ్రాండ్‌గా పేరుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తీరిక లేకుండా గడిపే దీదీ.. ఏ విషయానైన్నా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తుంటారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తుంటారు. తాజాగా ఆమె సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియోలో మమత కుక్కపిల్లను చేతిలో పట్టుకుని దానివైపు చూస్తూ ట్రెడ్‌మిల్‌పై నడుస్తుంటారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 20 వేల మంది లైక్‌ చేశారు. దీనికి కామెంట్లు ఆఫ్‌ చేశారు. 

మమతా బెనర్జీ 68 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇస్తుంటారు. గతంలో కూడా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు డార్జిలింగ్‌లో 10 కిలోమీటర్లు జాగింగ్‌ చేశారు. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ సైతం కోల్‌కతా వెళ్లి మమతా బెనర్జీని కలిశారు. మరోవైపు కర్ణాటక ఎన్నికలతో భాజపా పతనం ప్రారంభమైతే సంతోషిస్తానని  మమత వ్యాఖ్యానించారు. అలానే లైంగిక వేధింపులను ఎదుర్కొన్నామని ఆందోళన చేస్తున్న మహిళా రెజ్లర్లకు మమత తన మద్దతు ప్రకటించారు. క్రీడాకారులు మన దేశ సంపదతో సమానమని, రాజకీయాలకు అతీతంగా వారికి మద్దతు తెలిపాలని కోరారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని