Moustache: తిరిగి విధుల్లోకి ‘మీసాల’ పోలీసు.. సస్పెన్షన్​ ఎత్తివేత

భారీ మీసాలతో డ్యూటీకి హాజరై సస్పెన్షన్​కు గురైన మధ్యప్రదేశ్​ పోలీస్​ కానిస్టేబుల్‌ను ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకుంది.......

Published : 11 Jan 2022 01:17 IST

భోపాల్‌: భారీ మీసాలతో డ్యూటీకి హాజరై సస్పెన్షన్​కు గురైన మధ్యప్రదేశ్​ పోలీస్​ కానిస్టేబుల్‌ను ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకుంది. కానిస్టేబుల్‌​ రాకేశ్​ రాణాను మళ్లీ విధుల్లోకి తీసుకున్నట్లు సోమవారం అధికారులు వెల్లడించారు. రాణాపై సస్పెన్షన్​ వేటు వేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ఏఐజీ ప్రశాంత్​ శర్మకు అతన్ని తప్పించే అధికారం లేదని పేర్కొన్నారు. అందుకే ఆ ఉత్తర్వుల్ని ఉపసంహరించుకున్నట్లు వివరించారు. తాజా నిర్ణయంతో రాకేశ్​ రాణా తిరిగి పోలీస్​ డిపార్డ్‌మెంట్​లో మోటార్​ వెహికల్​ విభాగంలో డ్రైవర్‌గా చేరనున్నారు.

భారీగా మీసాలు పెంచి, వాటిని ట్రిమ్‌ చేయడానికి నిరాకరించాడనే కారణంతో కానిస్టేబుల్‌ రాణాపై సస్పెన్షన్‌ వేటు పడింది. ‘పోలీస్ శాఖలో ఇలాంటి వైఖరిని ప్రోత్సహించం. మీసాన్ని మెడవరకూ పెంచాడు. వాటిని ట్రిమ్‌ చేయకుండా వస్తే.. అక్కడ పని చేసే సిబ్బందిపైనా అతడి ప్రభావం పడేలా ఉంది. అందుకే విధుల నుంచి సస్పెండ్‌ చేయాల్సి వచ్చింది’ అని అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ప్రశాంత్‌ వర్మ పేర్కొన్నారు. దీనిపై రాణా స్పందిస్తూ.. ఉద్యోగపరంగా ఎలాంటి ఫిర్యాదులూ లేవని తెలిపారు. మీసాలు ఉండటమే తనకు గర్వకారణమన్నాడు. దాని కోసం సస్పెండ్‌ అయినా ఫర్వాలేదని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని కరాఖండిగా చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని