Modi: సంత్‌ రవిదాస్‌ జయంతి.. మోదీ భజన కీర్తన

ప్రముఖ కవి సంత్‌ రవిదాస్‌ జయంతిని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేడు దిల్లీలోని గురు రవిదాస్‌ విశ్రామ్‌ ధామ్‌ మందిర్‌ను సందర్శించారు. అక్కడ

Updated : 16 Feb 2022 11:17 IST

దిల్లీ: ప్రముఖ కవి సంత్‌ రవిదాస్‌ జయంతిని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేడు దిల్లీలోని గురు రవిదాస్‌ విశ్రామ్‌ ధామ్‌ మందిర్‌ను సందర్శించారు. అక్కడ రవిదాస్‌ విగ్రహాన్ని దర్శించుకుని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మందిర్‌లోని భక్తులతో కొంతసేపు మాట్లాడిన ప్రధాని.. వారితో కలిసి భజన కీర్తనల్లో పాల్గొన్నారు. భక్తులతో కలిసి కీర్తనలు ఆలపించారు. ఈ వీడియోను మోదీ తన ట్విటర్‌ ఖాతా ద్వారా షేర్‌ చేస్తూ.. ‘‘ప్రత్యేక క్షణాలు’’ అని రాసుకొచ్చారు.

గురు రవిదాస్‌ జయంతి పంజాబ్‌ దళితుల ప్రముఖ పండగ. 15-16 శతాబ్దానికి చెందిన సంత్‌ రవిదాస్‌ తన కీర్తనలతో ప్రజలను చైతన్యవంతం చేశారు. ఆయనను ఆరాధించేవారు పంజాబ్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ సంఖ్యలో ఉంటారు. రవిదాస్‌ జయంతిని పురస్కరించుకునే ఈ ఏడాది పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 20కి మార్చారు.

ఈ ఏడాది పంజాబ్‌ ఎన్నికలు అటు భాజపాకు, ఇటు కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అమరీందర్‌ రాజీనామా, సిద్ధూ - చన్నీ విభేదాల వంటి అంతర్గత సమస్యలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సవాల్‌గా మారాయి. అయితే వాటిని అధిగమించి మరోసారి రాష్ట్ర పగ్గాలు చేపట్టాలని హస్తం పార్టీ పట్టుదలతో ఉంది. మరోవైపు భాజపా కూడా విజయం కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ నేడు పఠాన్‌కోట్‌లో పర్యటించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని